కిసాన్ క్రెడిట్ కార్డు.. రైతులకు రూ.3 లక్షలు
రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీం ద్వారా ఐదేళ్లలో రూ. 3 లక్షల వరకు లోన్ పొందొచ్చు. ఈ కార్డు కాల పరిమితి 5 ఏళ్ళ వరకు ఉంటుంది. దీనికి వడ్డీ 4 శాతం లేదా 3 శాతం వరకు మాత్రమే ఉంటుంది. ఇక ఈ లోన్ ఇచ్చే ముందు.. రైతు ఆదాయం, వ్యవసాయ భూమి ఎంత ఉందో పరిశీలించి లోన్ ఇస్తారు. ఈ స్కీం ద్వారా లోన్ పొందేందుకు మీ సమీపంలోని బ్యాంకును సంప్రదించవచ్చు.