
గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి పోసాని
వైసీపీ సానుభూతిపరుడు, నటుడు పోసాని కృష్ణమురళి గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి చేరుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబును దూషించిన కేసులో బెయిల్ మంజూరు చేసే క్రమంలో.. వారంలో రెండు రోజులు సీఐడీ కార్యాలయంలో పోసాని హాజరుకావాలని గుంటూరు న్యాయస్థానం షరతు విధించింది. అందులో భాగంగానే సోమవారం, గురువారం గుంటూరు సీఐడీ కార్యాలయంలో సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఐడీ కార్యాలయంలో పోసాని హాజరయ్యారు.