హర్యానా అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను తాజాగా విడుదల చేసింది. ఎంఎస్‌పికి చట్టబద్ధత, కులగణన సర్వేతో పాటు 7 హామీలను కాంగ్రెస్ ఇచ్చింది. పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఏడు హామీలకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఖర్గేతోపాటు, కాంగ్రెస్ హర్యానా చీఫ్ ఉదరు భాన్, ఆ రాష్ట్ర మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా, హర్యానా ఎన్నికల ఎఐసిసి పరిశీలకులు అశోక్‌గెహ్లాట్, ప్రతాప్‌సింగ్ బజ్వాలు పాల్గొన్నారు.