చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ వీరే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీ అయిన చెన్నై సూపర్ కింగ్స్ 2025 సీజన్‌కి రిటైన్ చేసుకున్న ప్లేయర్ల జాబితాను విడుదల చేసింది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని రూ.4 కోట్లకు అన్క్యాప్డ్ ప్లేయర్‌గా రిటైన్ చేసుకుంది. ఇక రుతురాజ్ గైక్వాడ్‌ను రూ.18 కోట్లు, రవీంద్ర జడేజాను రూ.18 కోట్లు, మతీశ పతిరనను రూ.13 కోట్లు, శివం దూబెను రూ.12 కోట్లకు రిటైన్ చేసుకున్నారు.