VIDEO: ఏపీలో ఎక్స్పైరీ డేట్ దాటిన మద్యం కలకలం
AP: తిరుపతిలో ఎక్స్పైరీ డేట్ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. శిల్పారామం ఆవరణలోని పీఎస్ స్క్వేర్ మద్యం దుకాణంలో గడువు ముగిసిన బీర్లు లభ్యమయ్యాయి. దీంతో తేదీ గుర్తించిన మందు బాబులు షాపు యజమానిని ప్రశ్నించగా.. వారు దురుసుగా సమాధానం ఇచ్చి, ఎదురుదాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మద్యం వినియోగదారులు ఎక్సైజ్‌శాఖ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.