ఒంగోలు
ఒంగోలు: లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన నగర మేయర్
ఒంగోలు నగరంలో సోమవారం నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగర మేయర్ గంగాడ సుజాత పలు ప్రాంతాలలో మునిగిన కాలనీలను పరిశీలించారు రాజీవ్ కాలనీ, 60 అడుగుల రోడ్డులో ఉన్న పోతురాజు కాలువను, గుర్రం జాషువా కాలనీని గంగాడ సుజాత సందర్శించారు. అత్యవసర సమయాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులకు వారు సూచించారు.