రాజమండ్రి శివారులో మళ్లీ కనిపించిన చిరుత
రాజమండ్రి శివారులో గత కొంత కాలంగా చిరుతపులి సంచారం భయాందోళన కలిగిస్తోంది. తాజాగా రాజమండ్రి శివారు దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో మరోసారి చిరుత కదలికలు గుర్తించారు. ఆ ప్రాంతంలో అమర్చిన ట్రాప్ కెమెరాలో చిరుత కదలిక చిత్రాలు కనిపించాయని అధికారులు తెలిపారు. దీంతో చిరుతని ట్రాప్ బోనులతో పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిరుత పులిని ఖచ్చితంగా పట్టుకుంటామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.