అనంతపురం
అనంతపురం: పల్లెనిద్రల ద్వారా గ్రామీణ సమస్యల పరిష్కారంపై దృష్టి
అనంతపురం జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాలతో ఆదివారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమాన్ని పోలీసులు ప్రారంభించారు. ఐదు సబ్ డివిజన్లలో గ్రామాల్లో బస చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకోవాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలకు రహదారి భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. మట్కా, ఇసుక అక్రమ రవాణా వంటి అక్రమ కార్యకలాపాలను నివారించాలని ప్రజలకు సూచించారు. మహిళా భద్రతకు పోలీసులు అండగా ఉంటారని హామీ ఇచ్చారు.