ఏపీలో విషాదం.. డోలీలోనే మహిళ మృతి
AP: గిరిజన ప్రాంతాల్లో డోలీ కష్టాలు వీడటం లేదు. వైద్యం చేయించుకోవడానికి డోలీలో వెళ్తూ అల్లూరి జిల్లా అనంతగిరి మండలం గుమ్మా పంచాయతీలోని కర్రిగూడకు చెందిన సుక్రమ్మ అనే మహిళ ప్రాణాలు విడిచింది. వాంతులు, విరోచనాలతో రెండ్రోజులుగా బాధపడుతున్న ఆమెను డోలీలో ఆస్పత్రికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ డోలీ కష్టాలను తీర్చాలని స్థానికులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.