శుభ ఘడియలు వచ్చేశాయ్.. రెండు నెలల్లో 18 ముహుర్తాలు
తెలుగు రాష్ట్రాలకు పెళ్లి కళ రానుంది. కల్యాణ ఘడియలు రావడంతో లోగిళ్లలో హడావుడి, దుకాణాల్లో సందడి కనపడుతోంది. దాదాపు ఏడాది తర్వాత అధిక సంఖ్యలో వివాహ ముహూర్తాలకు తేదీలు ఖరారవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి మొదలైంది. కాగా, వచ్చే నవంబరులో 12, 13, 17, 18, 22, 23, 25, 26, 28, 29, డిసెంబరులో 4, 5, 9, 10, 11, 14, 15, 16లు శుభప్రదమైన రోజులుగా పండితులు చెబుతున్నారు.