'ట్రామీ' తుపాను విధ్వంసం.. 115 మంది మృతి(వీడియో)
ఫిలిప్పీన్స్లో ఉష్ణ మండల తుపాను 'ట్రామీ' విధ్వంసం సృష్టించింది. భారీ వర్షాలు, వరదలు, పలు చోట్ల కొండ చరియలు విరిగిపడటంతో దాదాపు 115 మంది మరణించారు. వందలాది మంది గల్లంతయ్యారు. వరద బాధితులను రక్షించేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వరదల కారణంగా ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. కాగా ట్రామీ బీభత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వరద ప్రవాహంలో కార్లు, ట్రక్కులు సైతం కొట్టుకుపోయాయి.