చంద్రగిరి
శ్రీ కల్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలకు శరవేగంగా ఏర్పాట్లు
తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి 17వ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. అక్టోబరు 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు జరుగుతున్న ఏర్పాట్లపై ఉత్సవ కమిటీ సభ్యులతో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి ఆదివారం సమీక్ష నిర్వహించారు. తిరుమల తరహాలో స్వామి వారికి, భక్తులకు ఏలాంటి లోటు లేకుండా ఉత్సవాల నిర్వహణ చేపట్టాలన్నారు.