ఉత్తరప్రదేశ్ ట్రాజెడీ.. దర్యాప్తు కమిటీ ఏర్పాటు
ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం సంభవించి 10 మంది శిశువులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కమిటీని రాష్ట్ర ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసింది. వైద్యవిద్య డీజీ నేతృత్వంలోని ఈ కమిటీ ఏడు రోజుల్లో సమగ్ర నివేదికను అందజేస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.