
శ్రీశైలం
శ్రీశైలంలో నేడు జరిగే సర్కారీ సేవా పూజలు ఇవే
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రంలో సోమవారం పలు సర్కారీ సేవా పూజలు జరగనున్నాయి. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లకు వెండి రథోత్సవం, ఊయల సేవ, సహస్రదీపార్చన కార్యక్రమాలు చేపట్టనున్నారు. అదేవిధంగా ఆలయ దక్షిణ మాడ వీధిలోని నిత్య కళారాధన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి.