తిరుమలలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
AP: శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పోలీసులు తిరుమలలో తనిఖీలు నిర్వహించారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలలో భాగంగా బాలాజీ నగర్లో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డులను పరిశీలించి, సరైన గుర్తింపు కార్డులు లేని 15 మంది వ్యక్తులు బైండోవర్.. 32 వాహనాలు సీజ్ చేశారు. తిరుమలలో నిషేధిత వస్తువులపై ప్రత్యేక నిఘాను ఉంచారు.