బీహార్లో ఆలయం గోడ కూలి ఇద్దరు చిన్నారుల మృతి.. ఒకరికి గాయాలు
బీహార్లోని సరన్ జిల్లాలో గురువారం విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని కథియా బాబా ఆలయ సరిహద్దు గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకున్నారు. జేసీబీ సాయంతో శిథిలాల తొలగింపునకు చర్యలు చేపట్టారు. గాయపడ్డ చిన్నారిని ఛప్రాలోని సదర్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు బాధిత కుటుంబాలను ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.