Top 10 viral news 🔥
గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో రెండో రోజూ ఐటీ సోదాలు!
AP: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చుట్టూ ఉచ్చు బిగిసుకుంటోంది. భీమవరం వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో రెండో (గురువారం) రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి 12 గంటల వరకు శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగాయి. గ్రంధి శ్రీనివాస్ వ్యాపార భాగస్వాముల ఇళ్లల్లోనూ ఐటీ శాఖ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.