Top 10 viral news 🔥
ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బీజేపీ నేత నయా డిమాండ్
AP: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజులైనా జరగాలని బీఏసీ సమావేశంలో బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రుషికొండలో వైసీపీ ప్రజాధనం దుర్వినియోగంపై చర్చ జరగాలని ఆయన సీఎం చంద్రబాబును కోరారు. సభ్యులంతా ఒక రోజు రుషికొండలో పర్యటించాలని అన్నారు. వైసీపీ రుషికొండపై చేపట్టిన విలాసవంతమైన నిర్మాణాలపై సుదీర్ఘ చర్చ జరపాలని కోరారు.