రేపల్లె
రేపల్లె: మొక్కలు నాటిన డిఎస్పి శ్రీనివాసరావు
మానవుని మనుగడకు పచ్చదనం ఎంతో ముఖ్యమని రేపల్లె డిఎస్పి ఆవల శ్రీనివాసరావు అన్నారు. బుధవారం రేపల్లె పట్టణంలోని ఇండియన్ బ్యాంక్ బజార్ వద్ద ఉన్న చెత్త పాయింట్ ను శుభ్రం చేసి అక్కడ మొక్కలు నాటారు. భవిష్యత్తు తరాలకు మనం మంచి చేయాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని డిఎస్పి తెలిపారు. పట్టణంలో ఖాళీగా ఉన్న నిరుపయోగ స్థలాలలో విరివిగా మొక్కలు నాటాలని సూచించారు.