చంద్రగిరి
చంద్రబాబును కలిసిన తిరుచానూరు సీనియర్ టిడిపి నాయకుడు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలను సమర్పించిన అనంతరం విజయవాడ కు శనివారం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో తిరుచానూరు సీనియర్ టిడిపి నాయకుడు చంద్రశేఖర్ నాయుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా రేణిగుంట విమానాశ్రయంలో కలిశారు. ఈ సందర్భంగా సీఎంను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు.