Top 10 viral news 🔥
ఘరానా దొంగ.. చిటికెలో ఫోన్ కొట్టేశాడు (వీడియో)
హైదరాబాద్ మల్కాజిగిరిలో కొందరు యువకులు సినీ ఫక్కీలో ఫోన్ కొట్టేశారు. ఓ వ్యక్తి షాపులో వస్తువు కొనడానికి రాగా ఇద్దరు యువకులు వచ్చి అతడి ముందు ఒకరు, పక్కన మరొకరు నిలబడ్డారు. ముందున్న యువకుడు డబ్బులు కిందపడేసి, 'డబ్బులు మీవేనా? కిందపడ్డాయి' అని ఆ వ్యక్తిని అడిగాడు. వాటిని తీసుకోవడానికి పెద్దాయన కిందికి వంగగానే మరో యువకుడు జేబులో నుంచి ఫోన్ కొట్టేశాడు. ఈ ఘటన అక్కడి సీసీ టీవీలో రికార్డయింది.