Top 10 viral news 🔥
వచ్చే ఏడాది అక్టోబర్ 2న ‘కాంతార చాప్టర్ 1’ రిలీజ్
కన్నడ నటుడు రిషభ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘కాంతార చాప్టర్ 1’. ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. రిషభ్ హీరోగా.. స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా చిత్రబృందం రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. వచ్చే ఏడాది అక్టోబర్ 2న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.