Top 10 viral news 🔥
పవన్ నోట 'జై తెలంగాణ' నినాదం
మహారాష్ట్రలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 'జై తెలంగాణ' నినాదం చేశారు. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ తరపున పవన్ ప్రచారం చేశారు. 'మీ అందరిలో చాలా మంది పక్కనే ఉన్న తెలంగాణ నుంచి వచ్చిన వారు ఉన్నారు. జై తెలంగాణ. 'బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి' పాట నాకు ఎంతో ఇష్టం. మీరు మహారాష్ట్రలో ఉన్న తెలంగాణ పోరాట స్ఫూర్తితో గుండెల్లో మరాఠా శౌర్యాన్ని నింపుకొన్నారు' అని పవన్ అన్నారు.