మంగళగిరి
తాడేపల్లి: బాలిక పట్ల వృద్ధుడు అసభ్య ప్రవర్తన
తాడేపల్లిలోని డోలాస్ నగర్ కు చెందిన ఓ బాలిక పట్ల వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు పెదవడ్లపూడికి చెందిన నాంచారయ్య అనే వ్యక్తి డోలాస్ నగర్ లోని ఓ ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక తల్లిదండ్రులకు చెప్పగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నాంచారయ్యపై పోక్స్ కేసు నమోదు చేశారు.