చీరాల
చీరాల: రైలు పట్టాల పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
చీరాల-వేటపాలెం రైల్వే స్టేషన్ల మధ్య పట్టాల పక్కన గురువారం ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉండగా గ్యాంగ్ మెన్ గుర్తించి చీరాల రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రైల్వే ఎస్సై కొండయ్య ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి పంపారు. మృతుడిని గుర్తించడానికి ఎటువంటి ఆనవాళ్లు లేవని, ఎవరికైనా సమాచారం తెలిస్తే చెప్పాలని ఎస్సై కోరారు