Top 10 viral news 🔥
పవన్ డెసిషన్ కి ఫుల్ సపోర్ట్!
ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన ఒక పాలసీ డెసిషన్కి ఏకగ్రీవంగా మొత్తం సమాజం నుంచి మద్దతు దక్కుతోంది. పవన్ కళ్యాణ్ సభలో డిప్యూటీ స్పీకర్గా రఘురామ కృష్ణరాజుని అభినందించే కార్యక్రమంలో మాట్లాడుతూ సోషల్ మీడియా పోస్టింగుల మీద కీలక వ్యాఖ్యలు చేశారు. భావ ప్రకటన స్వేచ్చకు హద్దు ఉండాలని, అయితే అది హద్దులు దాటుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి సభలోని అందరూ ఆయనకు మద్దతు ప్రకటించారు.