బామ్మను చంపి శివలింగానికి రక్తార్పణ
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. నన్‌కట్టి గ్రామానికి చెందిన 30 ఏళ్ల గుల్షన్ గోస్వామి తన నానమ్మ రుక్మిణి గోస్వామి(70)ని త్రిశూలంతో చంపాడు. ఇంటి పక్కనే ఉన్న శివాలయంలోని శివలింగానికి ఆమె రక్తాన్ని అర్పించాడు. తర్వాత తానూ అదే త్రిశూలంతో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మూఢ నమ్మకాల వల్ల ఆ వ్యక్తి నానమ్మను నరబలి ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.