గుంటూరు వెస్ట్
గుంటూరులో విజయ భేరి విద్యా సదస్సు
గుంటూరులో ఆదివారం ప్రభుత్వ పాఠశాలల విజయభేరీ విద్యా సదస్సు జరిగింది. డెమోక్రటిక్ పీఆర్టీయూ గుంటూరు జిల్లా శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, పారిశ్రామికవవేత్త తాళ్ళ వెంకటేశ్ యాదవ్ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వంతో మాట్లాడి ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. శ్రీను, నాగేంద్రమ్మ, పినాకపాణి పాల్గొన్నారు.