అద్దంకి
కొరిశపాడు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
కొరిశపాడు మండలం తిమ్మన్నపాలెం వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొంగపాడు నుండి ఒంగోలు వైపు రాంగ్ రూట్ లో వెళుతున్న ఆటో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం రెండు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న కొంగపాడుకు చెందిన శివకృష్ణకు గాయాలు అయ్యాయి. హైవే పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని క్షతగాత్రుడిని హైవే అంబులెన్స్ లో ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.