జనగాం
ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపించండి
జనగాం నియోజకవర్గం ధూళిమిట్ట మండలం బెక్కల్ గ్రామంలో గడపగడపకి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. శనివారం బీఎస్పీ ధూళిమిట్ట మండల అధ్యక్షులు గుండె ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రచారంలో బహుజన వర్గాల హక్కుల కోసం బహుజన్ సమాజ్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి అయితరాజు అబ్బేందర్ ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో గుండె రాజు, అరుణ్ లు పాల్గొన్నారు.