వరంగల్ (వెస్ట్)
గంజాయి పట్టివేత.. ఇద్దరు మహిళల అరెస్టు
కమలాపూర్ మండలంలోని ఉప్పల్లో బుధవారం పోలీసులు ఇద్దరు మహిళలను నుంచి రెండు కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నాట్లు సీఐ హరికృష్ణ తెలిపారు. పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా. నర్సంపేటకు చెందిన మంతోజు స్వరూప, ఉప్పల్ గ్రామానికి చెందిన ఎండీ. షమీమ్ అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి ఎండు గంజాయి, రూ. 17, 900 నగదు, మూడు సెల్ఫోన్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.