వరంగల్ (వెస్ట్)
సభ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్లు, కమిషనర్
ముఖ్యమంత్రి వరంగల్ పర్యటన నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాల కలెక్టర్లు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శనివారం పరిశీలించారు. పర్యటన కు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. సీఎం రాక మొదలుకుని అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, అభివృద్ధి పనుల సమీక్ష, తిరిగి హైదరాబాద్ బయలుదేరే వరకు ఏర్పాట్లను గురించి చర్చించారు.