Oct 25, 2024, 05:10 IST/
లారెన్స్ బిష్ణోయ్ సోదరుడి సమాచారం ఇస్తే రూ.10 లక్షల రివార్డ్: ఎన్ఐఏ
Oct 25, 2024, 05:10 IST
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ గురించి సమాచారం ఇస్తే రూ.10 లక్షల రివార్డ్ ఇస్తామని తాజాగా జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రకటించింది. ఎన్సీపీకి చెందిన బాబా సిద్దిఖీ హత్యకు ముందు షూటర్లతో అన్మోల్ చాటింగ్ చేసినట్లు ముంబై పోలీసులు గుర్తించారు. 2022లో పంజాబ్ సింగర్ సిద్దూ మోసేవాలా హత్య కేసులో అన్మోల్ ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఆయనపై రివార్డును ప్రకటించింది.